హైదరాబాద్‌లో న్యాయవాది మృతి ఘటన బాధాకరం సీసీవి

పయనించే సూర్యుడు మే 28(హైదరాబాద్ ) హైదరాబాద్‌లో న్యాయవాదిపై కారుతో ఢీకొట్టిన ఘటనలో ఆయన మృతి చెందిన వార్త మాకు తీవ్ర బాధ కలిగించింది. ఈ ఘటనపై కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది.న్యాయవాదులు సమాజంలో న్యాయం కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేసే వ్యక్తులు. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఈ విషాద ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని మరియు పోలీసు శాఖను కోరుతున్నాము. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు వేగంగా స్పందించాలి. రాష్ట్రంలో న్యాయవాదులు, ప్రజలు భయపడకుండా జీవించే పరిస్థితులు ఉండాలి. సమాజంలో హింస, దౌర్జన్యాలకు తావు లేకుండా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.