పయనించే సూర్యుడు జూన్ 5 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, శాంతిభద్రతల అంశాలు మరియు పార్టీ బలోపేతానికి సంబంధించిన విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలు, స్థానిక అవసరాలు మరియు అభివృద్ధి ప్రాధాన్యతలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, విపత్తుల సమయంలో సమర్థవంతమైన నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.