0నుండి 6 సంవత్సరాల పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపాలు పై అవగాహన

పయనించే సూర్యుడు జూన్ 6 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల జడ్పీ హైస్కూల్ నందు చిన్నారుల సమగ్ర అభివృద్ధి ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏ ఐ ఆధారిత ఈసీడి స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ బి. హే నా సుజన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ నవచేతన కార్యక్రమం మీద 0నుండి 6 సంవత్సరాల పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపాలు మానసిక రుగ్మతలు ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి వారికి స్క్రీనింగ్ ద్వారా సేవలందించి ప్రారంభ దశలోనే వైకల్యాన్ని గుర్తించి పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేసే విధంగా అంగన్వాడీ కార్యకర్తలందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్తలూరు మెడికల్ ఆఫీసర్ ఈ నవీన్ . పిల్లలు పుట్టినప్పటి నుండి ప్రారంభ దశలోనే వచ్చేటువంటి వైకల్యాల గురించి అంగన్వాడీ కార్యకర్తలుఏ విధంగా స్క్రీనింగ్ చేయాలి స్క్రీనింగ్ చేసిన తర్వాత గుర్తించిన వైకల్యాన్ని డాక్టర్ రెఫర్ చేస్తూ అవసరమైతే డైస్ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు1000 రోజుల సంరక్షణ గురించి సిడిపిఓ పి సునీత తెలియజేశారు పిల్లలలో అభివృద్ధి చెందవలసిన ఐదు రకాల అభివృద్ధిలలో గురించి స్థూల చలనం సూక్ష్మ చలనం భాష మేధా మరియు సామాజిక భావ ఉద్వేగ అభివృద్ధిల గురించి సూపర్వైజర్ ఎం పద్మ తెలియజేసే ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తల పాల్గొన్నారు ఇట్లు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు