100 రోజుల ఉపాధి హామీ పథకంలో గోల మాల్ పనికి వస్తామంటే మీ పేర్లు లేవంటున్న వైనం

★ ఈ వేసవి లో రెక్క ఆడితే డొక్కాడని పేదవారి జీవన పరిస్థితి ఏంటి ★ అధికారుల నిర్లక్ష్యం వలన ఉపాధి హామీ పథకానికి దూరం

పయనించే సూర్యుడు న్యూస్ మే 20, 2026:గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో, 100 రోజుల మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులకు దూరంగా ఉన్న ప్రజలు, గ్రామాల్లో చాలావరకు నిరుపేద కుటుంబాలే ఎక్కువ జీవిస్తుంటారు. వర్షాకాలంలో ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పిల్ల పాపలతో, పొట్ట చేత పట్టుకుని, జీవను ఉపాధి కొరకు వలసలు వెళుతుంటారు. వేసవికాలంలో మాత్రం వలసలు వెళ్లడానికి ఎక్కడ కూడా పనులు దొరకక, సొంత గ్రామాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మహాత్మా గాంధీ 100 రోజుల ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటారు. వర్షాలు వచ్చేంతవరకు పొలాల్లో పనులు ప్రారంభం కాకా కుటుంబ పోషణ భారమై పనులు వెళ్దాం అనుకుంటే, ఇక్కడ ఓ సమస్య పిడిస్తుంది. గడ్డపార మెడ పెట్టుకొని పనికి ఎక్కడ వెళ్లాలని, ఫీల్డ్ అసిస్టెంట్ ని అడిగితే, మీరు పనులు చేయాలంటే ముందు మీ పేర్లు ఆన్లైన్లో ఉండాలి కదా, మీరు చేస్తే కూలీలు రావని మీ సమస్య తీరేంతవరకు వేరే పనులైన వెతుక్కోండి లేకపోతే ఇంటి దగ్గరే ఉండిపోండి అంటూ సమాధానం ఇస్తున్నారు. ఎన్ని రోజులు మేము ఇంటి దగ్గరే ఉండాలి మా 100 రోజులు పని దినాలైనా మేము చేసుకోవాలి, పనులు అయిపోయాక మేము ఏమిచేయాలి, అని లబ్ధిదారులు ప్రశ్నించగా, ఆ సమస్య నా పరిధిలో లేదు రెండు రోజులు కావచ్చు, వారం, నెల ఎన్ని రోజులైనా కావచ్చు, అంటూ సమాధానం ఇస్తున్నారు. వేసవిలో పనులు దొరికేది వంద రోజులు ఆ పనిని కోల్పోతే మా పరిస్థితి ఏంటి, గంజహళ్లి గ్రామం లోనే సుమారు 100 మంది లబ్ధిదారులు ఆన్లైన్లో పేర్లు లేక 100 రోజుల ఉపాధి హామీ పనిని కోల్పోతున్నారని, ప్రభుత్వం వేసవిలో ప్రజలకు పనులు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 100 రోజుల ఉపాధి హామీ పథకం అధికారుల నిర్లక్ష్యం వలన మీ పేర్లు లేవంటూ 100 మంది లబ్ధిదారుకు పనులు లేకుండా చేయడం ఎంతవరకు న్యాయమని, అధికారులను అడిగితే ఈ సమస్య జిల్లా పిడి దగ్గరే పరిష్కారం కావడం లేదని సమాధానం ఇస్తున్నారు. ఒక గ్రామంలో ఇంత మంది పని కోల్పోతే మండలం మొత్తంపైన ఉపాధి కోల్పోయిన వారెందరో,ఇంతమంది ఉపాధి కోల్పోవడానికి, బాధ్యత వహించాల్సింది ఎవరు, ఉపాధి హామీ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ (టి ఎ) ఏపీవో నా,పిడి నా ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని గ్రామస్తులు తెలిపారు.