14వార్డ్ లో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 2 జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని 14 వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం రోజు నిర్వహించారు. ముందుగా మహిళ మండలి సభ్యులకు పూర్తి చేసిన అనంతరం ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చేర్మెన్, కౌన్సిలర్స్ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను శాలువా తో సన్మానించిన కోఆప్షన్ సభ్యురాలు గజం లక్ష్మి రవి ఈ కార్యక్రమానికి వైస్ చెర్మెన్ ఓంకార్ నవీన్,14వ వార్డు కౌన్సిలర్ ధోనికెలా శిరీష . 13వార్డ్ కౌన్సిలర్ అజేయ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, కోఆప్షన్ సభ్యురాలు గజం లక్ష్మి రవి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైస్,ఆర్పి ప్రేమలత,జమిళ, 14వార్డ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.