14వ వార్డులో డ్రైనేజీలు, చెత్త తొలగింపు పనులు చేపట్టిన కౌన్సిలర్

★ ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక పారిశుధ్య చర్యలు ★ డా. భూక్య ఉదయ జ్యోతి ప్రసాద్ రావు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 14వ వార్డులో కౌన్సిలర్ డా. భూక్య ఉదయ జ్యోతి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందితో కలిసి డ్రైనేజీల శుభ్రపరిచే పనులతో పాటు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, చెత్తను వెంటనే తొలగించడం ద్వారా దోమలు, సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ పరిశుభ్రత కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. వార్డులో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని డా. భూక్య ఉదయ జ్యోతి ప్రసాద్ రావు తెలిపారు.