పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 3 గూడూరు ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 184 వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ నిరంతరాయంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణం అన్నారు. గూడూరు ను జిల్లాగా చేసే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యారాం వెంకట్ సుబ్బయ్య మంజులమ్మ, శ్రీ గౌరీ, సుబ్బారెడ్డి, పంట శ్రీనివాసరెడ్డి అలాగర్, చంద్రశేఖర్ శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.