పయనించే సూర్యుడు మే 23, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఒకవైపు తీవ్ర ఎండలు మరోవైపు ఉక్క పూతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరోవైపు గత 30 రోజులుగా కరెంట్ కష్టాలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు నిమ్మకు మీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. వివరాల్లోకెళితే.. కాకినాడ జిల్లా, రామచంద్రపురం నియోజవర్గం బందరపుడి గ్రామంలో గత నెల రోజులుగా కరెంట్ కష్టాలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయమై అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. అసలే తీవ్ర ఎండలు తీవ్ర ఉక్క పూత తో గ్రామస్తులు ఇబ్బందులకు అవుతుంటే దీనికి తోడు ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కరెంటు కష్టాలు తోడయ్యాయి. ఇప్పటికైనా మరియు సంబంధిత అధికారులు మా గ్రామానికి కరెంటు కష్టాలు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం..