95.5% మార్కులతో గోల్డ్ మెడల్ సాధించిన యాడికి విద్యార్థిని వర్షిని

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జులై 7 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న యాడికి మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని వర్షిని 2026 ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించింది.వర్షిని 95.5 శాతం ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా కేంద్రం కర్నూలులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆమెకు ‘హరి ఉదాన్ మెరిట్ ఎక్సలెంట్ గోల్డ్ మెడల్’ మరియు ప్రశంస పత్రంతో ఘనంగా సత్కరించారు.ఈ ఘన విజయంపై వర్షిని తల్లిదండ్రులు చంద్రమౌలేశ్వర్ రెడ్డి, పార్వతి ,యాడికి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి మండలానికి, పాఠశాలకు పేరు తెచ్చిన కుమార్తెను చూసి గర్వంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.