99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక

చట్టం పరిచయం- నేపథ్యం

పయనించే సూర్యుడు కోరుట్ల మే 28. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి- ప్రణాళికలో భాగంగా బుధవారం రోజున ఐలాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ మరియు చట్టపరమైన బాధ్యతలకు సంబంధించి కూలీలకు పి ఓ ఎస్ హెచ్ చట్టం 2013 పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు అసంఘటిత రంగాలలోని అన్ని సంస్థలకు,ఎక్కడ పని చేసే లేదా ఆఫీసులకు పనిమీద వచ్చే ప్రతి మహిళకు వయసుతో సంబంధం లేకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. అని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఉపసర్పంచ్ సౌమ్య, కార్యదర్శి నవీన్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు కాలేశ్వరి,మంజుల, శైలజ,విమల, భాగ్యలక్ష్మి, సుజాత,సుమతి మరియు ఉపాధి హామీ వర్కర్లు పాల్గొన్నారు.