సందేపూడి గ్రామంలో ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమం కొనసాగింపు…

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 03 యడ్లపాడు మండల ప్రతినిధి.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా యడ్లపాడు మండలం సందేపూడి గ్రామంలో ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ సర్వేను నిర్వహిస్తున్నారు… ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుర్రం సురేష్ చౌదరి, 113వ బూత్ బీఎల్‌ఓ గుర్రం సురేష్ చౌదరి, 114వ బూత్ బీఎల్‌ఓ పి. శరత్, బాలినేని సాంబశివరావు, పత్తిపాటి పున్నయ్య పాల్గొని ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సరిచూసుకొని అవసరమైన సవరణలు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ సర్వేకు సహకరించి ఓటరు జాబితా ఖచ్చితత్వానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొని సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *