పయనించే సూర్యుడు జులై 3 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఖానాపూర్ ఎమ్మెల్యే కృషితో ఖానాపూర్ నియోజకవర్గం అబివృద్ధి దిశగా అడుగెలుస్తుంది అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చొరవతో నియోజకవర్గంలోని మండలాల్లో పీఆర్ హ్యామ్ ద్వారా బీటీ రోడ్లు మంజూరు అయినట్లు నిన్న ఉత్తర్వులు రావడం తో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో పలు మండలాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రులు స్తానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఉట్నూర్ మండలం ఐబీ చౌరస్తా వద్ద పాలాభిషకం నిర్వహించారు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది అని ఇటీవలే ఎకరానికి 6000 చొప్పున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశాం అని ఖానాపూర్ ఎమ్మెల్యే చొరవతో అనేక బీటీ రోడ్లకు నిన్ననే మంజూరు చేయించడం తో ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇక్బాల్మెస్రం భాగ్యలక్ష్మి,ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్,జైనూర్ ఎఎంసి వైస్ చైర్మెన్ బానోత్ జైవంత్,డైరెక్టర్ రాధా బాయ్ ఉట్నూర్ మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్,టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ నిసార్,ఉట్నూర్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి,ఉపాధ్యక్షుడు కొద్దు పటేల్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అరకిల్ల పరమేశ్వర్ రావ్,ఉట్నూర్ మండల అధ్యక్షుడు తిగుట్ల రాజ్ కుమార్,కొత్తపల్లి మహేందర్,ఉమేష్,రాజేష్,భాస్కర్, కలీం,కైసర్ తదితరులు పాల్గొన్నారు.