కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షుడిగా పూలపల్లి సుధాకర్ రెడ్డి నియామకం

పయనించే సూర్యుడు, జులై 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పూలపల్లి సుధాకర్ రెడ్డిని నియమించిన అధిష్టానం. సారపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్వ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం కలిగిన పూలపల్లి సుధాకర్ రెడ్డి ను మండల అధ్యక్షుడిగా నిర్ణయించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుధాకర్ రెడ్డి అటువంటి అనుభవం కలిగిన పూలపల్లి సుధాకర్ రెడ్డి ను మండల అధ్యక్షుడిగా నియమించడం శుభ పరిణామం అని అన్నారు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దిన దినాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలపల్లి సుధాకర్ కు అభినందనలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *