ఖానాపురం గ్రామంలో నూతన సిసి రోడ్డు పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు జులై 3 ఖానాపూర్ మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా తోట జగన్నాథం ఇంటి నుండి రాములు ఇంటి వరకు నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ, పంచాయతీ నిధులు నిధుల ద్వారానే ఈ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తూన్న కాలనీ వాసులకు ఈ రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో బురద, నీరు నిలవకుండా ప్రజల ఇబ్బందులు తీరుతాయని అన్నారు. నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది మరో ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ హరిబాబు, ఉప సర్పంచ్ ఉప్పు రాజు, మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్ పాలకవర్గ సభ్యులు శాఖమూరి ముకేష్, మహమ్మద్ అజహర్, చలిగంటి మల్లికార్జున్, కందుల రమాదేవి, గుండ్లపల్లి మంజుల గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *