ప్రభుత్వ హాస్పిటల్ లో మార్చురి ప్రారంభించిన డి సీ హెచ్ ఎస్ నరేంధర్.

పయనించే సూర్యుడు, జులై 3 బచ్చన్నపేట మండలం ప్రతినిధి; నీల పవన్. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మార్చురీ (మృతదేహాల భద్రపరిచే గది) సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటి వరకు మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లైంది. మార్చురీ ప్రారంభంతో ప్రమాదాలు, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో మృతి చెందిన వారి మృతదేహాలను అవసరమైన సమయం వరకు భద్రపరిచే అవకాశం ఏర్పడింది. దీనివల్ల ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు. సూపరింటెండెంట్, గీతారాణి, బచ్చన్నపేట మండల సర్పంచ్ అల్వాల నరసింహరావు, బచ్చన్నపేట ఎస్సై ఏ శ్రీకాంత్ డాక్టర్ శ్రీనివాస్,సృజన,దీప్తి, స్వప్న, ప్రసన్న, సర్పంచ్ అల్వాల నర్సింగరావు, ఉపసర్పంచ్ బైరి రజిత వెంకటేష్ గౌడ్,వార్డు సభ్యులు శివరాత్రి రాజు , పురాణం శ్రీనివాస్ వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *