విధేయతకే పట్టం – మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మొహమ్మద్ మసూద్

పయనించే సూర్యుడు, జులై 3, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మొహమ్మద్ మసూద్ నియామకం పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ, విధేయతకు దక్కిన గుర్తింపని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.1998లో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) ద్వారా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మసూద్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారు. జనగామలోని ఏబీవీ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తదనంతరం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల ఆశీర్వాదంతో ఎంపీటీసీగా విజయం సాధించారు. అధికార పార్టీ తప్పిదాలను ధైర్యంగా ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతుకగా నిలిచారు.రాజకీయ జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదురైనా వాటికి లొంగకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నీతి, నిజాయితీ, నిబద్ధత, విధేయతతో పార్టీ కోసం నిరంతరం సేవలందించారు. ఇలాంటి సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆయనను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా మసూద్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరిప్రతాప్ రెడ్డి డీసీసీ అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతరి లక్ష్మీనారాయణ నాయక్, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *