జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డి గౌని రెడ్డప్ప,సుబ్రహ్మణ్యం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 03.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా రెడ్డి గౌని రెడ్డప్ప అలాగే కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం లను నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఉత్తర్వు పత్రాలను అందించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం దిగువపల్లి గ్రామం ఏటవాకిలి పంచాయతీ కి చెందిన రెడ్డి గౌని వెంకట రమణ గౌడు కుమారుడు రెడ్డప్ప, పుంగనూరు మండలం కే బత్తలాపురం గ్రామం నెక్కుంది పంచాయతీకి చెందిన రామలింగప్ప కుమారుడు ఎం సుబ్రహ్మణ్యం బీసీల పక్షాన నిలబడి బీసీల సమస్యలపై చేసిన పోరాటాలు అదేవిధంగా సేవలను గుర్తించి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు షణ్ముగం తెలిపారు. అన్నమయ్య జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులుగా నియమితులైన రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను అన్నమయ్య జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా అలాగే కార్యదర్శిగా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్యకు, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమకు ఈ పదవులు రావడానికి సహకరించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి అలాగే మా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లాలో బీసీ కులాల బలోపేతానికి బీసీలకు ఏ సమస్య వచ్చిన ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని బీసీల రిజర్వేషన్ ఆధారంగా బీసీల కోసం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం నేతృత్వంలో అవసరమైన ఉద్యమాలు చేస్తామని తెలిపారు. త్వరలో అన్నమయ్య జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని విస్తరించి బీసీలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయం ప్రారంభిస్తామని రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *