పయనించే సూర్యుడు జులై 3 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్ జీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం నేతృత్వం వహించారు. కూటమి నాయకులతో కలిసి కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు పాల్గొన్నారు. వీబీజీ రామ్ జీ లక్ష్యాలు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది గ్రామీణ భారత అభివృద్ధికి కీలక పథకం. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు విస్తరించడం, స్థిరమైన గ్రామీణ ఆస్తుల నిర్మాణం, సాంకేతికత ఆధారిత పారదర్శక అమలు, గ్రామ పంచాయతీల పాత్ర బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు హామీ ఉపాధిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. నీటి సంరక్షణ, వ్యవసాయ అనుబంధ పనులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుపరచడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి గ్రామం భాగస్వామి కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి దిశగా ఇది ముఖ్యమైన అడుగు. నాగిరెడ్డి సతీష్ రావు కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి