పయనించే సూర్యుడు మే 20 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ మొదటి కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించాడని తన సొంత ఇంట్లో కూడా కులాన్ని అంటరానితనాన్ని వ్యతిరేకించిన మహోన్నత నాయకుడని అన్నారు కమ్యూనిస్టు విలువలకు ఒక నిలువుటద్దం లాంటివాడని అన్నారు దేశంలో కులం మతం ప్రాంతీయతత్వం పెట్రేగిపోతున్న ఈ క్రమంలో సుందరయ్య నాటి కాలంలో వీటికి వ్యతిరేకంగా చేసిన కృషి నేటి కమ్యూనిస్టులు మళ్లీ అమలు చేయాలని అన్నారు భూమి పోరాటాలు నిర్మిస్తూ ప్రజలందరికీ సమాన హక్కుల కోసం పోరాడమే సుందరయ్య కి ఇచ్చే ఘనమైన నివాళులు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శుభాకర్ శ్రీశైలం హనుమంతు నారాయణ లక్ష్మమ్మ మల్లేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు