కర్నూలు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకం: కలెక్టర్ డా. ఎ. సిరి ఉత్తర్వులు

పయనించే సూర్యుడు మే 21 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా విజిలెన్స్ కమిటీలో నూతన సభ్యులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి (ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేశారు.వినియోగదారుల హక్కుల రక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ముగ్గురు ప్రముఖులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. నియమితులైన నూతన సభ్యులు:వై. శివమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా వినియోగదారుల రక్షణ ఫోరం. ఈసా బాషా అధ్యక్షుడు, ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ ఫోరం.ఎం. పల్లవి వినియోగదారుల రక్షణ ఫోరం ప్రతినిధి.జిల్లా విజిలెన్స్ కమిటీలో తమకు సభ్యులుగా అవకాశం కల్పించినందుకు నూతన సభ్యులు శివమోహన్ రెడ్డి, ఈసా బాషా, మరియు ఎం. పల్లవి సంయుక్తంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి (ఐఏఎస్)జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ (ఐఏఎస్) జిల్లా డీఎస్ఓ (డీఎస్ఓ) రాజా రఘువీర్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇంచార్జ్ నదీమ్ హుస్సేన్ లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి, విజిలెన్స్ కమిటీ ఆశయాల సాధనకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *