ఆర్టీసి నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికుల నిరసన

పయనించే సూర్యుడు న్యూస్, మే 21 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఏలేశ్వరం డిపో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయం మొదటి డ్యూటీ నుండి ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి విధులకు హాజరవ్వడమైనది. డిపో కార్యదర్శి కే త్రిమూర్తులు, డిపో అధ్యక్షులు కే కామేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించడమైనది. ఈ సందర్బంగా ప్రధానమైన డిమాండ్లు విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందిని నిర్వహించాలి, శ్రీ శక్తి బస్సులలో జీరో టిక్కెట్ ఇచ్చే విధానాన్ని నిలబదలు చేసి, మిగతా ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పని భారం తగ్గించాలి, పిఆర్సి కమిటీని నియమించాలి ఐ ఆర్ ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న 4 డి ఏ లు మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి. ఈ నెల 13వ తేదిన ప్రభుత్వానికి, ఎం.డి కి ఇచ్చిన మెమో రాండంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి పాత టీమ్ ల స్థానంలో కొత్త టీమ్ లు కొనుగోలు చేయాలి. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *