పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి, మే – 21: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలో భాగంగా, కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ నెల 23 నుండి 30 వరకు విత్తన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కూనారం పరిశోధన కేంద్రం కే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. సతీష్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.కూనారం పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన అత్యుత్తమ రకం “కూనారం సన్నాలు కె.ఎన్.ఎమ్ 1638 పౌండేషన్ విత్తనం సుమారు 250 క్వింటాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, 10 కిలోల విత్తన సంచి ధర రూ. 750 గా ఉందని, ఈ రకం విత్తనం కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగిన రైతులు ఈ నెల 22వ తేదీ నుండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని, పరిమిత పరిమాణంలో విత్తనాలు అందుబాటులో ఉన్నందున, ప్రాంతీయ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విత్తన బుకింగ్ ఇతర పూర్తి వివరాల కోసం 8333818202 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని డాక్టర్ బి. సతీష్ చంద్ర ఆ ప్రకటనలో పేర్కొన్నారు.