జాతీయ రహదారిపై ప్రమాదం

పలువురికి గాయాలు

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 24 జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఆగిన ట్యాంకర్ ను ఆర్టిసి బస్సు అదుపుతప్పి ఢీకొన్న ఘటన మండలంలోని కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ,వెంకటగిరి కి చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరుకు ప్రయాణికులతో వెళుతుంది, కొండూరు సత్రం వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకరు మరమ్మత్తులకు గురై రోడ్డుపై ఆగిపోయింది. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో జయమ్మ అశోక్ జయంతి శుభ్రతమ్మ కళ్యాణ్ రామయ్య సునీతతో పాటు పలువుకి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *