పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 25.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని ఎస్.టి.యు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అద్యక్షుడు రమేష్ రాయల్ అద్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు అమరులైన విలేకరుల కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇంటి స్థలాలు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వంటి హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. జర్నలిస్టుల సహకారంతో మార్చి 4న జరిగిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిందని తెలిపారు. వేలాదిమంది జర్నలిస్టులు విజయవాడ నగరం వీధుల్లో హక్కుల సాధనకు గళమెత్తారని వివరించారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన సమాచార శాఖ మంత్రి పార్థసారథి జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని వివరించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. సంస్థాగతంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ను బలోపేతం చేసేందుకు స్థానిక నాయకత్వం కృషి చేయాలని వివరించారు. అనంతరం జూన్ 7న పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లా మొదటి మహాసభ నిర్వహిస్తున్నట్లు సమావేశం తీర్మానించింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ రాయల్, హిదాహితుల్లా@అప్ప, ఏపిబిజిఏ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రసాద్, రమేష్ బాబు అక్రిడేషన్ కమిటీ సభ్యులు జాకీర్, మంజునాథ్, రాజు, శ్రీనివాసులు, కటారి రామయ్య, గిరి, గిరి శేఖర్, ఆంధ్రప్రభ శీను, అస్లాం, నజీర్ సాహెబ్, బాలాజి, గురు ప్రసాద్, భానుకిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.