తిరుమలగిరి స్వయంభు శ్రీ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న నిత్యాన్నదాన పధకము విరాళం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 26 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న స్వయంభు శ్రీ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న నిత్యాన్నదాన పధకమునకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం వాస్తవ్యులు దివ్యెల అన్నపూర్ణమ్మ రూ.18,116/- రూపాయలు మరియు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వాస్తవ్యులు శ్రీ గుత్త కృష్ణ కళ్యాణి దంపతులు రూ.10,125/- రూపాయలు విరాళముగా అందజేసియున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సిబ్బంది శ్రీ స్వామి వారి ప్రసాదములు అందజేయుట జరిగినది అని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గుమ్మా వెంకటేష్, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి సిహెచ్. రంగారావు తెలియజేసియున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *