పయనించే సూర్యుడు మే 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్, మే 26: పేద ప్రజల ఆరోగ్య రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన వట్టెం శ్రీశైలం – శిరీష దంపతుల కుమారుడు వట్టెం వర్ధన్ వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.2,50,000 ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వర్ధన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోడిదల రాము, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్. నాగేష్, రాధాకృష్ణ, ఎల్.వెంకట్, అసాన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య సహాయం అందించినందుకు వర్ధన్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.