భూదేవి పండుగ…అంగరంగ వైభవంగా

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.28.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, దేవారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామం. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ (గిరిజన) గ్రామాల్లో చేసే పండుగలు ఆసక్తికరంగా ఉంటాయి.గంగాలమ్మ పండుగ, బాట పండుగ (దారి పండుగ),పప్పుల పండుగ (పప్పు కొత్త పండుగ),తోట పండగ కప్పల పండగ (వాన పండగ) ఇలా అనేక పండగలు చేయడం వారికి ఆనవాయితీ. వాటిలో భూదేవి పండుగ (భూమి పండుగ) వారికి ఎంతో ప్రత్యేకం, ఈ పండుగ గిరిపుత్రులు జీవనశైలిని,వారి ఆచారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.భూమి,నీరు,గాలి,అగ్ని,ఆకాశం ఈ పంచ భూతాలను దైవంగా భావిస్తూ వేల సంవత్సరాల క్రితం నుంచి వీటిని పూజిస్తున్నారు. ఆదివాసీ గిరిజనలకు కొత్త ప్రపంచంలోని కొత్త పోకడాలతో పనిలేదు.కొత్త కొత్తగా వస్తున్న టెక్నాలజీలు అవసరం లేదు. వారు నమ్ముకున్న బతుకుదెరువే వారికి దైవంతో సమానం. ప్రకృతి వారికి దేవుళ్ళు,దేవతలుగా కోలుస్తారు.తొలకరి జల్లులు కురిసే వేళ ఎంతో వైభోగంగా భూమి తల్లికి పూజలు చేస్తారు.పూజల తర్వాత నాగలి పట్టి భూమతను కరుణించమని కోరుతూ….పంటలు బాగా పండాలని వర్షలు కురిపించమని వేడుకుంటూ… భూదేవి పండుగను గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువతీ, యువకులు, పిల్లలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి భూదేవి పండుగను (భూమి పండుగ) జరుపుకుంటారు. గ్రామస్తులందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *