ఘనంగా గ్రామ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమం

పయనించే సూర్యుడు: మే: 28/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మండాలపాడులో భూమి పూజ చేసిన సర్పంచ్ గాయం రమేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీలో స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి వద్దన్నారు యమన్నారు) గ్రామ సంఘ మహిళా సంఘ భవన నిర్మాణానికి సోమవారం శంఖుస్థాపన జరిగింది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా 8,000 స్వయం సహాయక బృందాల భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణలోని కోటి మంది మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన నూతన “ఇందిరమ్మ చీరల” డిజైన్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి అనుగుణంగా మండాలపాడు గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ శ్రీ గాయం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన (భూమి పూజ) చేశారు.

.

సర్పంచ్ గాయం రమేష్


ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ, మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాల బలోపేతం, మహిళల సమగ్ర సామాజిక ఆర్థికాభివృద్ధి పట్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మరియు వారి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ నూతన భవనం ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ జేఈ (జేఈఈ) రమేష్, మహిళా సంఘం సీసీ (సి సి) నాగ చెన్నారావు, పెనుబల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలు మనీషా, ఫీల్డ్ అసిస్టెంట్ యడవల్లి సుబ్బారావు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచినీళ్లు వేంకటేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, పెండ్ర ఆదినారాయణ, యడవల్లి వెంకట చిన్నోడు, స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *