చిన్నారి భవిష్యశ్రీని ఆశీర్వదించిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్

* కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి రమేష్ * ఘనంగా జరిగిన చిన్నారి భవిష్యశ్రీ అన్నప్రాసన మహోత్సవ వేడుక...

పయనించే సూర్యుడు న్యూస్ :మే 28, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో తాళ్లూరి సురేష్ పావనిల దంపతుల కుమార్తె చిరంజీవి భవిష్య శ్రీ అన్నప్రాసన మహోత్సవం వేడుక బుధవారం అన్నారుగూడెంలో వారి స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ హాజరై చిన్నారిని అక్షింతలు వేసి దీవించారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని. ఉన్నతమైన విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భవిష్యత్తులో గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో మాజీ ఎంపీటీసీ,మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తుమ్మలపల్లి రమేష్, నాయకులు తుమ్మలపల్లి వెంకటేశ్వర రావు,మారెళ్ళ దేవేందర్,తాళ్లూరి బుల్లి రాములు తదితరులు చిన్నారిని ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *