ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణికి అభినందనల వెల్లువ

* పెరిక సంఘం ఆధ్వర్యంలో కందుల సంధ్యారాణికి సన్మానం.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినారి కాలనీ-28 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులైన బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ని కమాన్పూర్ మరియు సెంటినారి కాలనీ పెరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, సంఘ నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిక సంఘం నాయకులు సంధ్యారాణి కి పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె నాయకత్వంలో ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సంధ్యారాణి మాట్లాడుతూ… పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఓబీసీ వర్గాల హక్కులు, సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం మరియు పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరక సంఘం జిల్లా అధ్యక్షులు దుండే మల్లేష్ , సెంటర్ కాలనీ వెరక సంఘం అధ్యక్షులు ఉగ్గే కుమార్, జనరల్ సెక్రటరీ డి. రవీందర్, ట్రెజరర్ కందుల సదానందం, సంఘ నాయకులు లగిశెట్టి చంద్రమౌళి, నరేడ్ల శ్రీనివాస్ ,బుద్దే ఉదయ్, కే భూమయ్య, నరేడ్ల రమేష్ ,ఉగ్గే నవీన్, బుద్దే కొమురయ్య, ముద్దస్వామి, అభిలాష్, మధు కుమార్, మీస రఘురాం, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *