కంటి శిబిరంలో 112 మందికి కంటి పరీక్షలు, 50 మందికి కంటి ఆపరేషన్లు.

పయనించే సూర్యుడు మే 29 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గురువారం నాడు పాత కలెక్టరేట్ భవనం 102 గది లో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతమైనట్లు నాగర్ కర్నూల్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 112 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అర్హులైన క్యాటరాక్ట్ పొరగల 50 మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ లో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు. రోగులకు శిబిరం లో ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు,మందులు అందజేశారు. ప్రతి ఒక్కరు జీవితకాలము కంటిచూపును కలిగి ఉండుటకు నిత్య భోజనంలో విటమిన్ ఏ కూడిన క్యారెట్, ఆకుకూరలు,చేపలు, ఆహార పదార్థాలు అధిక మొత్తంలో తినాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుకుమార్ రెడ్డి,సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *