నేరేడుచర్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.

పయనించే సూర్యుడు 30 మే నేరెడుచెర్ల మండల ప్రతినిది (చింతల శ్రవణ్) నేరేడుచర్ల లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండల ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు రాష్ట్ర మంత్రి శ్రీ ఉత్తంకుమార్ రెడ్డి ని కోరారు శుక్రవారం నేరేడుచర్ల లోని సిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో పార్టీ ముఖ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కలిపి ఒకే ఒక ఫైర్ స్టేషన్ ఉండటం వల్ల ప్రజలకు అవసరానికి ఉపయోగపడటం లేదని అందువల్ల హుజూర్నగర్ ప్రాంతానికి ఒకటి నేరేడుచర్ల ప్రాంతానికి మరొక ఫైర్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అలాగే నేరేడుచర్ల గరిడేపల్లి పాలకీడు మండలాలకు ఒక షీ టీంలు ఏర్పాటు చేయాలని తద్వారా విద్యార్థినులకు మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని మరియు నేరేడుచర్లలో పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి.ఎస్.పి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేందుకు మంత్రి ఉత్తమ్ చేస్తున్న ప్రయత్నాలకు అభినందనలు తెలియజేస్తూనే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు షీ టీం మరియు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అలాగే నేరేడుచర్ల కేంద్రంగా మినీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని, పాలకవీడు మండలంలోని మహంకాళి గూడెం వద్ద కృష్ణానదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని తద్వారా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా డీ లిమిటేషన్ లో భాగంగా నేరేడుచర్లను అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, A I Y F జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను రైతు సంఘం మండల కార్యదర్శి కటికోల వెంకన్న ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్ ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *