పయనించే సూర్యుడు, మే 30 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శుక్రవారం రోజు అనగా తేదీ 29-05- 2026 నాడు ఉదయం అందాజా 11:00 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ వయస్సు అందాజా 25 సంవ త్సరాల నుండి 30 సంవత్సరాలు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్ప డిందని సమాచారం రాగా, వెంటనే పోలీసు వారు వెళ్లి హైడ్రా సహాయంతో దుర్గం చెరువు నీటిలో వెతుకగా ఒక గుర్తు తెలియని మహిళ దుర్గం చెరువు లో పడి చనిపోయి ఉన్నది. మృతురాలి ని పరిశీలించగా, వయస్సు అందాజా 25 సం”రాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నది. ఈమె చామన చాయ రంగు కలిగి ఉండి, నలుపు రంగు వెంట్రుకలు కలవు, నలుపు రంగు చుడిదార్, క్రీమ్ కలర్ లెగ్గిన్ ధరించి ఉన్నది. ఇట్టి మహిళా గురించి ఏదైనా ఆచూకీ తెలిసినచో వెంటనె మాదాపూర్ పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 8712663109, కు లేదా శ్రీ.డి. కృష్ణ మోహన్ ఎస్ హెచ్ ఓ మాధా పూర్ సెల్ నెంబర్ 8712663 100 మొబైల్ నెంబర్ లకు తెలియ జేయవలసిందిగా విజ్ఞప్తి.