పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 31.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంప్రతినిధి జె. నాగరాజ// గౌరవనీయులైన పుంగనూరు నివాసితులకు, దేశభక్తులకు మరియు దాతలకు, విషయం: పుంగనూరు బైపాస్ సర్కిల్లో భారత రత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మరియు నిధుల సేకరణ కొరకు అభ్యర్థన. ప్రియమైన కలాం వారి అభిమానులకు మరియు దాతలకు, భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, యువతకు ఆదర్శమూర్తి మరియు ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా కీర్తించబడిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి ఆశయాలను, సందేశాలను రాబోయే తరాలకు అందించడం మనందరి బాధ్యత. మన పుంగనూరు పట్టణంలో కలాం వారి స్మారకాన్ని గౌరవప్రదంగా నిలబెట్టాలనే సంకల్పంతో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ సర్కిల్‌ను “కలాం సర్కిల్” గా మారుస్తూ, అక్కడ కలాం వారి ఒక అద్భుతమైన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాము. ఈ ప్రతిష్టాత్మక మరియు సామాజిక ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఈ దిశగా మేము చేస్తున్న ప్రయత్నాలకు మీలాంటి ఉదార హృదయుల, దేశభక్తుల మరియు విద్యాభిలాషుల ఆర్థిక సహకారం ఎంతో అవసరం. కలాంవారి విగ్రహ ఏర్పాటు, పీఠం (బేస్మెంట్) నిర్మాణం మరియు ఆ ప్రాంత సుందరీకరణ కొరకు మీ శక్త్యనుసారం (చిన్న లేదా పెద్ద మొత్తంలో) విరాళాలు అందించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాల్సిందిగా మా ట్రస్ట్ తరపున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. గమనిక: అత్యధిక విరాళం అందించిన దాతల పేర్లను విగ్రహ పీఠంపై ఏర్పాటు చేసే గౌరవ శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కడం జరుగుతుంది బ్యాంక్ ఖాతా వివరాలు (బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్): ఖాతా పేరు (అకౌంట్ నేమ్ ): డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ పేరు): కెనరా బ్యాంక్ పుంగనూరుr ఖాతా సంఖ్య (అకౌంట్ నెంబర్ ): 110233211705 ఐఎఫ్ఎస్సీ కోడ్ : సి ఎన్ ఆర్ బి.0006609 మీరు అందించే ప్రతి రూపాయికి పూర్తి పారదర్శకతతో కూడిన మరియు 8 జి పన్ను మినహాయింపు వర్తించే రశీదు ఇవ్వబడుతుంది. మన పుంగనూరు నడిబొడ్డున కలాం వారి విగ్రహాన్ని సగర్వంగా ఆవిష్కరించుకోవడానికి మీ వంతు సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలతో, భవదీయుడు, (డాక్టర్ పి. అయూబ్ ఖాన్) ఛైర్మన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ పుంగనూరు. చరవాణి నెంబర్స్ 9849209263, 9381787644