దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాం ఒక్కటే

* ఆత్మకూర్ సర్పంచ్ రాజాం పోచమ్మ, (కూమారుడు రాజాంతిరుపతి )

పయనించే సూర్యుడు 1-6-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ ( ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, శాతల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నామస్మరణ” కార్యక్రమం నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సర్పంచ్ దంపతులు, జెల్ల అఖిల అనిల్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యం తిరుపతి మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌ కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు. ​ప్రతి ఆదివారం అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్న నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యలు ఇంజపురి మహేష్,మనలా ప్రసాద్,అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు సంగెపు శేఖర్, శాలివాహన కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ తిరుపతి, వెంకన్న,మద్దెల రవి, సిరికొండ తిరుపతి, ఎనగందుల రమేష్, చెవులమద్ది రాజలింగు, చెవులమద్ది హరీష్, జేరిపోతుల మహేష్, తో పాటు పలువురు అంబేద్కర్ వాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *