ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన భూపతిపూర్ విద్యార్థులు.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మామిడిపెల్లి లక్ష్మణ్ భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 5గురు విద్యార్థులు న్యాతగిరి సంజన, మామిడిపెల్లి సరస్వతి, ఆయేషా, ధనరేకుల గంగోత్రి, ధోనిపాల రాజధీపక్ లు త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయ్యారని ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. అంకితభావంతో పనిచేస్తూ భూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను సర్పంచ్ గుర్రం భావనమహేందర్ గౌడ్, ఉపసర్పంచ్ మూగల సంజీవచారి, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ అన్నవేని వేణు, పాఠశాల ఛైర్మెన్ అమరగొండ లావణ్య, మాజీ యాజమాన్య కమిటీ చైర్మెన్ జక్కుల రాజేంద్రప్రసాద్ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు కొనియాడారు అలాగే విదార్థుల కృషిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *