బానయ్య కోనేరు పదో వార్డులో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

పయనించే సూర్యుడు: శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని బానైకోనేరు పదో వార్డు పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు ఆదేశాల మేరకు మాజీ వార్డ్ మెంబర్ నేమాల ధనలక్ష్మి హరి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేయడం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, విధవులు తదితర లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి నివాసాలకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ వార్డ్ మెంబర్ నేమాల ధనలక్ష్మి హరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, అశక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు సూచనల మేరకు ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *