పెరిగిన అన్ని రకాల రసాయనీక ఎరువుల ధరలను ఉపసంహరించుకోవాలి

కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి అన్నదాతలను ఆదుకోవాలనీ రైతు సంఘం ధర్నా

పయనించే సూర్యుడు జూన్ 2 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వము రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు 90% సబ్సిడీ ద్వారా అందించాలని విత్తనాలు ఎరువులు పురుగుమందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం జిల్లా పార్టీ పిలుపుమేరకు సోమవారం రైతు సంఘం ఆదోని నియోజకవర్గం కార్యదర్శి బసాపురం గోపాల్ అధ్యక్షతన స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం ఆదోని నియోజకవర్గం కార్యదర్శి బసాపురం గోపాల్ గౌరవాధ్యక్షులు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అన్ని రకాల పంటలకు కనీసం మద్దతు ధరలను వర్తింపజేయాలని ప్రభుత్వమే రైతులకు ఇస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను 20000 రూపాయలు నుండి 50 వేల రూపాయల వరకు పెంచి ఒకేసారి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా రైతులందరికీ రెండు లక్ష రూపాయలు పంట రుణాలు మాఫీ చేసి రైచంగాన్ని ఆదుకోవాలని కోరారు పెరిగిన వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా బ్యాంకుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలని గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల పంటలకు నాన్న నేను విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు అనంతరం ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్ ఏఐవైఎఫ్ ఆదోని మండల అధ్యక్షులు అంజిత్ గౌడ్ దళిత హక్కుల పోరాట సమితి ఆదోని పట్టణ కార్యదర్శి విజయ్ సిపిఐ నాయకులు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *