మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వారికి,పుంగనూరు మున్సిపాలిటీ,

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 02.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా. పుంగనూరు నియోజకవర్గ 0ప్రతినిధి జె. నాగరాజ// ​విషయం: కౌండిన్య వంక పూడికతీత పనుల్లో అవకతవకలు – ప్రజాధనం వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నపం. ​అయ్యా, ​పుంగనూరు పట్టణ పరిధిలోని కౌండిన్య వంకలో జరుగుతున్న పూడికతీత పనుల అస్తవ్యస్త విధానాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నాము. ​గత కొంతకాలంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కౌండిన్య వంకలో మట్టి తీసే కార్యక్రమం జరగింది.అయితే, వంక నుండి తీసిన మట్టిని నిబంధనల ప్రకారం వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ఆ మట్టిని వంకకు అతి సమీపంలోనే (ప్రక్కనే) కుప్పలుగా పోస్తున్నారు. దీనివల్ల చిన్నపాటి వర్షం రాగానే ఆ మట్టి అంతా తిరిగి వంకలోనే కొట్టుకుపోతోంది. ​ఇప్పటికే ఇదే వంకలో మూడు సార్లు మట్టి తీయడం, ఆ మట్టి మరలా వంకలోనే పడటం జరిగింది. దీనివల్ల వంక విస్తరణకు ఎటువంటి ప్రయోజనం చేకూరకపోగా, ప్రజల సొమ్ము మాత్రం బిల్లుల రూపంలో వృధా అవుతోంది. కేవలం బిల్లులు క్లియర్ చేసుకోవడానికే ఈ పనులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ​కావున, తాము ఈ విషయంపై తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని కోరుతున్నాము. ఇకపై తీసిన మట్టిని వంకకు దూరంగా తరలించేలా చూడాలని, అలాగే గత మూడు సార్లు జరిగిన పనుల వ్యయంపై మరియు అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని పుంగనూరు ప్రజల తరఫున డిమాండ్ చేస్తు న్నాము. ​ధన్యవాదాలతో, ​భవదీయుడు, పి అయూబ్ ఖాన్ పుంగనూరు పౌరుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *