గోవు ను జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్డీవోకు వినతి పత్రం.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 02 జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మైనార్టీ యువకులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మెట్ పల్లి ఆర్డిఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖయ్యూం మాట్లాడుతూ మత పెద్దల సూచన మేరకు మెట్ పల్లి పట్టణంలో గోవధ నిషేధించాలని హిందువులు ముస్లింలు కుల, మతాలకు అతీతంగా సోదర, సోదరి భావంతో కలిసి మెలిసి ఉంటున్నామని గోవధ చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని గోసంతతి అంతరించి పోకుండా ఉండాలంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖయ్యూం, అబ్దుల్ జాకీర్, ఎండి ముస్తా కీన్, ఎండి గౌస్ ఉద్దీన్, షేక్ సైఫ్ అలీ ఖాన్, షేక్ రహమత్, ఫయుం, ఎండి షకిల్,ఎండి ఖయ్యూం పాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *