తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తితో అభివృద్ధి పథంలో

* ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు * అమరవీరులకు నివాళులు రక్తదాన శిబిరం ప్రారంభం * 100 పడకల ఆసుపత్రి పరిశీలన – అభివృద్ధి పనులపై సమీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 3 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమం జరిగింది అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి వేలాది మంది విద్యార్థులు యువకులు ఉద్యోగులు రైతులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణ విద్య వైద్యం వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని పేర్కొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా పట్టణంలో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సబ్‌స్టేషన్ల ద్వారా విద్యుత్ అంతరాయాలు తగ్గి గృహ వాణిజ్య మరియు వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు అశ్వారావుపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు రక్తదానం మహాదానమని ఒక వ్యక్తి చేసిన రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. సమాజ సేవలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ప్రతి ఆరోగ్యవంతుడు నిరంతరం రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందించవచ్చని సూచించారు అనంతరం అశ్వారావుపేటలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 100 పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వార్డులు అత్యాధునిక వైద్య పరికరాలు, రోగులకు అందించనున్న సేవలు వైద్య సిబ్బంది అవసరాలు మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి ప్రారంభం అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల నాణ్యత మిగిలి ఉన్న పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు రైతులు మహిళలు, విద్యార్థులు యువత వృద్ధులు కార్మికులు తదితర అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మున్సిపల్ కౌన్సిలర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్మ కమిటీ చైర్మన్ సహకార సంఘం అధ్యక్షుడు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యువజన ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *