ఎట్టకేలకు కదలిన మండగిరి పంచాయతీ యంత్రాంగం…వెల్లాలమధుసూధనశర్మ

పయనించే సూర్యుడు జూన్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. గత పదిరోజుల క్రితం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండగిరి పంచాయతీ పరిధిలోని ఆవుదూడ వంక పూడిక, కలుషిత నీరు సరఫరా డ్రైనేజీలలో పూడిక మొదలైన సమస్యలను బిజెపి నాయకులు వెల్లాల మధుసూధనశర్మ మరియు శాంతి ఎస్టేట్ కాలనీ యువకులతో కలిసి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఆరోజు నుండి పంచాయతీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారం చేయాలని డిఎల్ పి తిమ్మక్క ని ఓ మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును పలుమార్లు కోరగా ఎట్టకేలకు స్పందించి రెండు రోజుల క్రితం స్వచ్ఛమైన మంచినీటి సరఫరా మెరుగుపరచడం జరిగింది.అలాగే ఈరోజు ఆవుదూడ వంక పూడికతీత పనులు మొదలు పెట్టడం జరిగింది..ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని మధుసూదన శర్మ తెలిపారు.. కొన్ని రోజులు ఆలస్యం చేసిన వంక మూలంగా నష్టం జరగకముందే స్పందించిన పంచాయతీ అధికారులు డిఎల్ పి ఓ తిమ్మక్క కి, శ్రీనివాసులు కూడా మధుసూదన శర్మ కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగేష్,గాదిలింగ, మహేష్ నాయక్ మొదలైన వారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *