పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం హరీష్ రావు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం హరీష్ రావు మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాసాని చంద్రమోహన్, మందపాటి రాజమోహన్ రెడ్డి, కౌన్సిలర్ ఉదయ జ్యోతి, సంకా ప్రసాదు, అంజి ,సత్యవరపు సంపూర్ణ, గొడవర్తి వెంకటేశ్వరావు, చిప్పనపల్లి బజారయ్య, ఒగ్గేల పూజ, కలపాల బాబురావు, నారం రాజశేఖర్, జుజ్జువరపు శ్రీరామమూర్తి, నాగరాజు, శ్రీను, ప్రదీప్, బన్ను, మోటూరి మోహన్, గంగాధర్, ప్రసాదు, రాజా రమేష్, రఘురాం, ఆసిఫ్, వెంకటేశ్వరరావు, రవిచంద్ర, తగరం జగన్నాథం, రహిమూన్ , జీవన్ రావు, ఆరేపల్లి రాంబాబు , శివ తదితరులు పాల్గొన్నారు.