నూతన పైప్ లైన్ తో పాటు రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు జూన్ 5 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపురం మండల కేంద్రంలో చాగంటి వెంకటేశ్వర్లు ఇంటి నుండి భద్రారెడ్డి ఇంటి వరకు నూతన పైప్ లైన్ పనులతో పాటు రోడ్డు వెడల్పు పనులను సర్పంచ్ దాసరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రజా అవసరాలను గుర్తించి గ్రామపంచాయతీ నిధుల ద్వారానే నూతన పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు దీని ద్వారా ఇరుకుగా ఉన్న సిసి రోడ్డుకు ముగింపు పలికి వెడల్పు రోడ్లకు శ్రీకారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు కందుల రమాదేవి, గుండ్లపల్లి విజయ్, చలిగంటి మల్లికార్జున్, ఈలపొంగు కొమరమ్మ, మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్ గ్రామస్తులు కామిశెట్టి సుధీర్, పల్నాటి శ్రీనివాస్, రాగం సతీష్, కందుల సాంబయ్య, మల్లోజు పరిపూర్ణ, చాగంటి వెంకటేశ్వర్లు, మొహినోద్దీన్, కసుబాద సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *