పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 6. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన అందించిన సందర్భంగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, కోరుట్ల పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కల్లూరు రోడ్డు లోని త్రిశక్తి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయాలని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు వృక్షో రక్షతి రక్షితః! ప్రకృతిని దైవంగా భావించే గొప్ప సంస్కృతి మన భారతదేశానిది. పశ్చాత్తాపం లేని సంస్కృతికి భిన్నంగా, ప్రకృతిని పూజించే మన సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుతంగా పునరుద్ధరిస్తోంది. ఈ సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని, జీవనాధారమైన భూమాతను స్మరిస్తూ మొక్కలు నాటుదామని తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి సాగర్,ఎర్ర రాజేందర్,జిల్లా నాయకులు సుదవేని మహేష్,గిన్నెల శ్రీకాంత్, మేకల గణేష్, చేటపెళ్లి ఓంప్రకాష్,మైదం సత్యనారాయణ, ఉప్పులూటీ రాఘవులు,రాధారపు సత్యనారాయణ,ధమ్మా సంతోష్,రాగంశెట్టి సాయి, నారవేని విజయ్ బాల్క ప్రేమ్ సాగర్,ఇర్నాల స్వామి కైరంకొండ రాజగంగాధర్, అందుర్తి రమేష్ కుంట నారాయణ, బిజెపి మరియు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.