మహిళా సాధికారిత- మహిళలు చట్టాలపై అవగాహన కార్యక్రమం పీడి

పయనించే సూర్యుడు జూన్ 6 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన ఎస్ సి కాలని నందు బేటి బచావో -బేటి పడావో” వార్షిక క్యాలండర్ అనుసరించి హెచ్ యు బి -మహిళా సాధికారిత- మహిళలు మరియు చట్టాలపై సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహణ ఐసీడీఎస్ నెల్లూరు జిల్లా పీడీ బి. హేన సూజన్ మేడం ఆదేశాల మేరకు, శుక్రవారం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఎస్సీ కాలనీ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మహిళలకు ప్రీ-మారిటల్ కౌన్సిలింగ్, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు మరియు ,మహిళలకు సంబంధించిన చట్టాలు విమెన్ రిలేటెడ్ యాక్ట్స్ మరియు హెల్ప్ లైన్ నెంబర్స్ 181, 112,1098, సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందించబడుతున్న వివిధ సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని బి. హేన సుజనా మేడమ్ సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ ఎస్.కె. షహనాజ్, కేస్ వర్కర్స్ పి. శారద, ఆత్మకూరు ప్రాజెక్ట్ సిడిపిఓ సునీలత . సూపర్వైజర్ పద్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎస్సీ కాలనీ మహిళలు మరియు డ్వాక్రా మహిళలకు 50 మంది పాల్గొనడం జరిగినది మహిళా సాధికారత, మహిళల హక్కులు మరియు సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *