పర్యావరణ పరిరక్షణ సకల జీవన సంరక్షణకు పాటుపడుతున్న కడలి సత్యమూర్తికి నంది అవార్డు..

పయనించే సూర్యుడు 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవం పురస్కరించని చైతన్య ఆర్గనైజేషన్ అధ్యక్షులు కడలి సత్యమూర్తి ఇటీవల తెలంగాణ హైదరాబాదులో యువ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా పర్యావరణ పరిరక్షణ సకల జీవుల సంరక్షణ కొరకు అలాగే వన్ యూస్ ప్లాస్టిక్ పై పోరాటం సత్యమూర్తికి నంది అవార్డు ఇవ్వడం జరిగింది. దీనిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం పర్యావరణ పరిరక్షణ కార్యాలయంలో కడలి సత్యమూర్తికి దుస్సాల వాళ్ళతో పూలదండ లు వేసి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ నంది అవార్డు అందుకున్న సత్యమూర్తికి ముందుగా శుభాకాంక్షలు అని అవార్డులు బాధ్యతలు మరింత పెంచుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో పాటుపడు ఉన్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. అనంతరం సత్యమూర్తి మాట్లాడుతూ 2016 నుండి చైతన్య ఆర్గనైజేషన్ అధ్యక్షగా కొనసాగుతూ నా వంతు కృషి చేస్తున్నానని నాకు సహకరించిన నంది అవార్డు అందించిన యువ ఆర్ట్స్ వారికి మరియు నాకు సన్మానం చేసిన మా ప్రియ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడలి శ్రీనివాస్, కోన సుబ్బారావు ,తలాటం శంకర్రావు, ఎల్లమల్లి రాంబాబు, కడలి ఉమా మహేశ్వర స్వామి, కడలి వేణుగోపాలకృష్ణ ,మాజీ సైనికులు సూర్యదేవర రామారావు, అయినవిల్లి నారాయణ ,గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *