బెట్టింగ్ గ్యాంగ్ కేరాఫ్సర్పవరం భవన్ నారాయణ స్వామి ఆలయంలో ఆఖరి షెడ్యూల్ ముహూర్తపు షాట్..

పయనించే సూర్యుడు జూన్ 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వారెవా జతగాళ్ళు సినీ డైరెక్టర్ సత్యసలాది దర్శకత్వంలో సలాది క్రియేషన్స్ సలాది శ్రీనివాస బాబు నిర్మాణంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం శ్రీ భవన్ నారాయణ స్వామి ఆలయంలో ముహూర్తపు షార్ట్ కు ప్రముఖ వ్యాపారస్తులు కర్రి చక్ర రావు క్లాప్ కొట్టగా రెడ్ల రాఘవరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా పుల్ల శ్రీరాములు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సత్య సలాది మాట్లాడుతూ గతంలో వారవ్య జతగాళ్ళు సినిమా తీయడం జరిగిందని అలాగే రెండో సినిమాగా సలాది క్రియేషన్స్ జన్మిన్ స్టార్ లక్ష్మణ్ హీరోగా బెట్టింగ్ గ్యాంగ్ ఆఖరి షెడ్యూల్ ను ముహూర్తపు షార్ట్ భవన్ నారాయణ స్వామి ఆలయంలో తీయడం జరిగిందని నవంబర్ నెలలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం తోట చక్ర రావు, డిఓపి షేక్ వలి మరియు సలాది శ్రీనివాస బాబు లు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు పాకులాడుతూ తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నా సందర్భంగా యువతని మంచి మార్గంలో పెట్టేందుకు ఈ బెట్టింగ్ ఏం కేరాఫ్ కాకినాడ సినిమా తీయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జేసి పిడిఆర్ ప్రసాద్ రెడ్డి, పండురూ పెద్దబాబు, నల్లాల బాబు, నారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *