రత్నాపూర్ గ్రామాభివృద్దికి సహకరించండి

* ఆర్డీవో కు వినతి పత్రం అందించిన సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, రామగిరి-06 రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో మేడిపల్లి శివారులోని రామగిరిఖిల్లా అభివృద్ది కొరకు 200 ఎకరాల భూములు ఇండస్ట్రీయల్ పార్కు కొరకు తీసుకుంటున్నారని సర్పంచ్ పల్లె ప్రతీమా పివి రావు అన్నారు. ఈ క్రమంలో మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది,కావున దయచేసి గ్రామాభివృద్దికి నిధులు కేటాయించగలరనీ శుక్రవారం రత్నాపూర్ గ్రామపంచాయతీకి విచ్చేసిన మంథని ఆర్డీవో కాసబోయిన సురేష్, తహసీల్దార్ పర్నంది సుమన్ కు వినతి పత్రం అందించారు. రామగిరి ఖిల్లా రహదారి అయిన రత్నాపూర్-మన్నాల వాడ వరకు సిమెంట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. రత్నాపూర్ లోని సంజీవనగర్ ఆర్అండ్ బి రోడ్డు నుంచి వాగుకట్ట మీద నుంచి తులభూమయ్య పొలం మీదుగా రామగిరిఖిల్లాకు వెళ్లే రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలి. రత్నాపూర్ గ్రామంలోని కెక్కర్ల శివ ఇంటి ముందు నుండి (పల్లె వాడ) గూడ్ల రమేష్ ఇంటి వరకు సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలి రైతుల పొలాలకు వెళ్లే రహదారైన పల్లె మీద నుంచి శ్రీరాంసాగర్ కాలువ మీదుగా తెట్టెకుంట నుంచి ఆర్ఎస్ఐబి ఆఫ్ డి/83 ప్రధానకాలువ వరకు మట్టి రోడ్డు అద్వాన్నంగా మారింది. దీనిని కంకర రోడ్డు లేదా తారు రోడ్డు వేయాలనీ కోరారు. రాంనగర్ లో వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న లైన్ అద్వాన్నంగా మారింది. నూతన సిసి రోడ్డు నిర్మాణం చేయించగలరు. రామగిరి కిల్లా ప్రాంతంలో వైకుంఠ దామం కు, ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 ఎకరాల భూమి కేటాయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, కనవేన రవి, బత్తుల రాజమణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *