ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమం

పయ నించే సూర్యుడు జూన్ 6 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి పిలుపు మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీ ఓ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. మనకు జన్మనిచ్చి, ప్రేమను పంచి, జీవితానికి పునాది వేసిన అమ్మను స్మరించుకుంటూ, ఆమె పేరుతో ఒక మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఒక మొక్కను నాటడం అంటే కేవలం చెట్టును పెంచడం మాత్రమే కాదు, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం మరియు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే.

ఈ సందర్భంగా “ఏక్ పేడ్ మా కే నామ్” (అమ్మ పేరున ఒక మొక్క ) కార్యక్రమం పేరిట కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పంచాయతీ వీబీజీ రామ్ జీ ఉపాధి పని ప్రదేశం వద్ద ఉపాధి శ్రామికుల సమక్షంలో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు మొక్క నాటే కార్యక్రమం చేపట్టారు.పర్యావరణ హితానికి ప్రతీ ఒక్కరు అమ్మ పేరిట ఒక మొక్క నాటాలని ఈ సందర్బంగా ఎంపీడీఓ పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణకై ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యత వహించాలని హితవుపలికారు. కార్యక్రమంలో చెయ్యేరు క్షేత్ర సహాయకులు శ్రీరామ్,వీబీజీ రామ్ జీ సీవో వెంకటేష్, చెయ్యేరు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *